యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ప్రభుత్వ కాలువ కబ్జా
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ప్రభుత్వ భూమి కాలువను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు శనివారం తహశీల్దార్ గోలి రవికిరణ్ కు వినతిపత్రం అందజేశారు. ఊర చెరువు అలుగు నీరు పారే కాలువను పక్క రైతు ఆక్రమించుకుని రాతి కడీలు పాతినట్లు రైతులు ఆరోపించారు. వెంటనే సర్వే నిర్వహించి కాలువను, దారిని కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.