అల్లూరి జిల్లా యువతి రవని ఘనత: పారా ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Alluri Sitharama Raju
అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అంధ అథ్లెట్ రవని వలసనైని జపాన్లో జరిగిన పారా ఆసియా క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని క్రీడా వర్గాలు తెలిపాయి. చిన్నప్పుడే చూపు కోల్పోయినప్పటికీ పట్టుదల వదలక క్రికెట్, అథ్లెటిక్స్లో రాణించిన రవని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కఠిన శ్రమతో అంతర్జాతీయ వేదికపై భారత్ కీర్తిని ఇనుమడింపజేసిన రవనికి పలువురు అభినందనలు తెలిపారు.