ఏఐ కృత్రిమ మేధస్సుపై ఆంక్షలతో స్టార్టప్ రూపొందించిన విద్యార్థిని
రిపోర్టర్: వెంకట్
స్థలం: వర్జీనియా
పాఠశాలలో కృత్రిమ మేధస్సు సాధనాలపై ఆంక్షలు విధించడంతో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన పదిహేడేళ్ల హైస్కూల్ విద్యార్థిని నవ్యా తుటేజా 'రాహా' పేరుతో సరికొత్త ఏఐ స్టార్టప్‌ను రూపొందించారు. థామస్ జెఫర్సన్ హైస్కూల్ విద్యార్థిని అయిన ఆమె, న్యూరోడైవర్జెంట్ ఉద్యోగార్థులకు సహాయపడేలా ఈ ఉచిత వేదికను అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫాం ఇప్పటికే వెయ్యి మందికి పైగా వినియోగదారులను సంపాదించుకుందని, తన తల్లి ఎదుర్కొన్న సవాళ్ల నుండి ఈ ఆలోచన వచ్చిందని నవ్యా తుటేజా వెల్లడించారు.