డెట్రాయిట్లో ఆచార్య యార్లగడ్డ తెలుగు పఠనా పోటీలు: నిర్వాహకులు వెల్లడి

రిపోర్టర్: సురేష్ స్థలం: డెట్రాయిట్

డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25వ తేదీన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు పఠనా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షురాలు శుభ్రతా గడ్డం తెలిపారు. మిచిగన్లోని ఎస్వీ టెంపుల్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయని, విద్యార్థులలో భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఐదో తరగతి లోపు విద్యార్థులతో పాటు ఆరు నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.