ఏపీలో ముగిసిన మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ గడువు అధికారికంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 3,650 షాపుల్లో 88.7 శాతం షాపులు రెన్యువల్ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, అక్టోబర్ 3న లాటరీ పద్ధతి ద్వారా మిగిలిన షాపులను కేటాయించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.