లక్ష్య సాధన కోసం యువత పోటీపడాలి: రఘునాథ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండేపల్లి

లక్ష్యాలను సాధించేందుకు యువత ఎప్పుడూ పోటీ పడాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పిలుపునిచ్చారు. దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామంలో బిజెపి అభ్యర్థి మానస సంజీవ్ సర్పంచ్ గా గెలుపొందడంతో, గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.4 లక్షలతో నిర్మించిన వివేకానంద గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, సర్పంచ్ మానస సంజీవ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రంథాలయం ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.