రూపాయికే బైపాప్ వెంటిలేటర్ సేవలు అందిస్తున్న డాక్టర్
రిపోర్టర్: అశోక్
స్థలం: ఒడిశా
ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన డాక్టర్ శంకర్ రామచందాని పేద రోగుల కోసం రూపాయికే బైపాప్ వెంటిలేటర్ సేవలను ప్రారంభించారు. ఐసీయూ ఖర్చులు భరించలేని తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లుగా నామమాత్రపు రుసుముతో వైద్యం అందిస్తూ వన్ రూపీ డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు.