ఓబనపల్లి కంచమ్మ తల్లి ఆలయంలో మూడవ పౌర్ణమి వేళ వైభవంగా అన్నదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
రైల్వే కోడూరు మండలం ఓబనపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ కంచమ్మ తల్లి ఆలయంలో మూడవ పౌర్ణమి సందర్భంగా భక్తులకు అత్యంత భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓ. హరినాథ్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు.