కాన్పూర్‌లో మామ హత్య కేసులో కోడలు అరెస్ట్, విచారణకు పోలీస్ కస్టడీ కోరిన పోలీసులు.
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉత్తర ప్రదేశ్
కాన్పూర్‌లో జరిగిన మందుల వ్యాపారి వినీత్ మనోచ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన కోడలు షాలును విచారించేందుకు పోలీసులు 15 రోజుల కస్టడీ కోరారు. మామను హత్య చేయడానికి ఆమె సుపారీ కిల్లర్లతో కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. భర్త సుబ్రత్ పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.