తిరుమలలో ఘనంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం నిర్వహించిన భక్తులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వేడుకున్నారు.