ధర్మవరంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి సత్యకుమార్ ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ధర్మవరం
ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కమలం, సైకిల్ గుర్తులపై ఓట్లు వేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి వార్డుల అభివృద్ధికే కృషి చేసే అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.