భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న పనబాక లక్ష్మి

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి వినాయక సాగర్ వద్ద ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.