వాయుసేన చీఫ్ అశుతోష్ దీక్షిత్ కీలక ప్రకటన: సరికొత్త వాయు విజన్ ఆవిష్కరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
భారత వాయుసేన నూతన చీఫ్ అశుతోష్ దీక్షిత్ ఆదివారం తన ప్రాధాన్యతలను స్పష్టం చేస్తూ వాయు విజన్ ను ప్రకటించారు. యుద్ధ సన్నద్ధత, స్వదేశీ రక్షణ పరికరాల తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు మరియు త్రివిధ దళాల మధ్య సమన్వయమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి స్క్వాడ్రన్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని వాయుసేన అధికారులను ఆయన హెచ్చరించారు.