పాలకొండలో టీడీపీ రికార్డు విజయం కదంతొక్కిన పసుపు శ్రేణులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇరవై ఒకటో వార్డు లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాగోది వెంకటరమణ రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే వార్డు వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నూతన విజేత వెంకటరమణ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.