టెక్ ప్రపంచంలో సంచలనం: ఏఐ స్టార్టప్ బ్రొకలీ సంస్థకు భారీ నిధులు
రిపోర్టర్: శివ
స్థలం: టెక్సాస్
బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు ఏజే జైన్ మరియు ఆదిత్య కేత్కర్ స్థాపించిన బ్రొకలీ ఏఐ స్టార్టప్ తొమ్మిది నెలల వ్యవధిలో యాభై రెండు మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్లు ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది. కాలిఫోర్నియాలో చిన్న వ్యాపారాల సమస్యలను అధ్యయనం చేసి ఈ కృత్రిమ మేధ సంస్థను రూపుదిద్దినట్లు వ్యవస్థాపకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ మూడు వందల మిలియన్ డాలర్లకు చేరినట్లు నిపుణులు తెలిపారు.