కాకినాడ కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ సంచలన నిజాలు!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాకినాడ
కాకినాడలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. సౌజన్యను పెళ్లి చేసుకుని ఆస్తి కొట్టేయడానికే జగదీశ్వరరెడ్డికి సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆస్తి విషయంలో నూకరాజుతో గొడవపడ్డానని, అయితే వారు ఆత్మహత్య చేసుకుంటానని ఊహించలేదని విచారణలో స్పష్టం చేశాడు.