తమిళ చిత్రంలో విలన్ పాత్రతో సుహాస్ అద్భుత నటన.
రిపోర్టర్: సతీష్
స్థలం: తమిళనాడు
ప్రముఖ తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం 'మందాడి'లో తన విలక్షణ నటనతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మథిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన పూర్తిగా భిన్నమైన నెగెటివ్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు విభిన్న పాత్రలతో అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులను మెప్పిస్తూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.