రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల ప్రవేశ పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ప్రవేశ పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 20, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.