తెలంగాణ సాంస్కృతిక వైభవం: మంచిర్యాల జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఏసీసీలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూడళ్లలో ఒకచోట బతుకమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ పాటలతో ఆడిపాడుతూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.