హైదరాబాద్‌లో త్వరలోనే మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ కామన్ టికెట్ విధానం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ టికెటింగ్ విధానాన్ని సిద్ధం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ రవాణా మార్గాలతో పాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమయం కోసం అధికారులు ఎదురుచూస్తుండగా, వారం రోజుల్లో ఈ కామన్ టికెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.