ఓటర్లకు అలర్ట్: పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవడానికి ఎస్ఈసీ వెబ్సైట్

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఓటర్ల సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిందని అధికారులు వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పుర ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎపిక్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.