అమెరికాలో కలకలం: మధ్యంతర ఎన్నికల పోలింగ్ లో ఈవీఎంలు ఫెయిల్, బాంబ్ బెదిరింపులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Washington
అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మధ్యంతర ఎన్నికల పోలింగ్ లో తీవ్ర అంతరాయాలు తలెత్తాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. న్యూయార్క్ నగరంతో పాటు పలు ప్రాంతాలలో బ్యాలెట్ స్కానర్లు మొరాయించగా, ఓహియోలో బాంబ్ బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అన్ని ఓట్లను పకడ్బందీగా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.