ఏఐ సాంకేతికత ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలి: సత్య నాదెళ్ల

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత మానవాళికి సహాయకారిగా ఉండాలని, అది ఎల్లప్పుడూ మనుషుల నియంత్రణలోనే పనిచేయాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. ఒకవేళ సాంకేతికత మానవ నియంత్రణను దాటిపోతే ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. AI ఫలాలు అందరికీ సమానంగా అందాలని, మైక్రోసాఫ్ట్ భద్రతా నిబంధనలను త్వరలో సార్వజనీక సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.