పాలనలో కృత్రిమ మేధ: ఏఐ సాక్షమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ప్రభుత్వ పాలనను మరింత వేగవంతంగా మరియు పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ఏఐ సాక్షమ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి సామాన్య ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.