జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద మాడ్యూల్ రట్టు
రిపోర్టర్: సురేష్
స్థలం: జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం మరియు సహాయం అందించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ అజమ్, జాకీర్ హుస్సేన్, మహ్మద్ ముస్తాఖ్‌లుగా గుర్తించిన ఈ నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్ మరియు చైనీస్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలకు సహకరిస్తున్న ఈ నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.