ఏపీ టెట్-2026 ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డ్
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో టెట్-2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది కీని కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. రెగ్యులర్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 47గా ఉండగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం 51గా నమోదైంది. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చూసుకునే వెసులుబాటు కల్పించారు.