అమిత్ షా టూర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనాలను పోగేసుకుని దమ్కీ ఇస్తే భయపడేవారెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మీ చేతుల్లోనే ఉందని, దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులను బయటపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ పేరు చెబితే బీజేపీ ఎందుకు వణికిపోతోందని ఆయన సూటిగా నిలదీశారు.