ఫిన్లాండ్‌లో గూగుల్ పెట్టుబడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

అమెరికాలో అనుమతుల జాప్యం కారణంగా ఫిన్లాండ్‌లో 15 బిలియన్ డాలర్ల భారీ ఏఐ పెట్టుబడులు పెట్టాలన్న గూగుల్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్ తన నిర్ణయాన్ని వెంటనే పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఉందనే ప్రచారం ఒక బూటకమని తేల్చిచెప్పారు.