రూపాయిల కోట్లతో విశాఖలో వినూత్న డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ వెల్లడించింది. ఒకే పిల్లర్పై ఫ్లైఓవర్ మరియు దానిపైన మెట్రో రైలు వెళ్లేలా ఈ అధునాతన ప్రాజెక్టును నిర్మించనున్నారు. తొలి దశ పనుల కోసం పదకొండు వేల నాలుగు వందల తొంబై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీజేపీ పేర్కొంది. ఈ సరికొత్త రవాణా వ్యవస్థతో వైజాగ్ నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అధికారులు తెలిపారు.