కూటమి సర్కారుకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని గణేష్ గర్జన
రిపోర్టర్: Nelluri Chiranjeevi
స్థలం: గొలుగొండ
గొలుగొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి మాదల ప్రవీణ్ కుమార్ మరియు ఎంపీటీసీ అభ్యర్థి కసిపల్లి అప్పారావులకు ప్రజలు భారీ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ప్రభుత్వ పనితీరుపై ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.