నాగావళి ఉగ్రరూపం: పుర్లి నుంచి ఖండ్యాం వరకు కరకట్టల నిర్మాణంపై రైతుల ఆందోళన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
నాగావళి నది వరదలతో పంట భూములు నీటమునుగుతున్నాయని పుర్లి నుంచి ఖండ్యాం వరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భూసేకరణ పూర్తయినా నిధులు అందక పనులు నిలిచిపోయాయని నీటిపారుదల శాఖ జేఈ యశ్వంత్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన తరువాత ప్రభుత్వానికి సమగ్ర అంచనాలు పంపుతామని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ హామీ ఇచ్చారు.