టీమ్ఇండియా టెస్ట్ జట్టులోకి అర్ష్దీప్ సింగ్: దిగ్గజాల కీలక సూచన

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆక్లాండ్

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను వెంటనే టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటు అజింక్యా రహానే స్పష్టం చేశారు. వైట్ బాల్ తో బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తున్న అతడి ప్రతిభ రెడ్ బాల్ క్రికెట్ కు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సుదీర్ఘ ఫార్మాట్ లో లెఫ్టార్మ్ పేసర్ కొరత తీరుతుందని వారు వెల్లడించారు.