తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడసేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: Tirupati
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 19న జరిగే గరుడసేవ నేపథ్యంలో టీటీడీ కీలక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజామున 3 గంటల నుంచే పుష్కరిణిలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలపై నిషేధం విధించింది. భక్తులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు.