'ద్వైపాక్షిక వాణిజ్యానికి పెద్దపీట..': భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద బిల్లు ఆమోదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

భారత్-న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలుకు అవసరమైన బిల్లును న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వెళ్లే ఎగుమతుల్లో 57 శాతం సుంకాలు తొలగిపోనుండగా, పూర్తిస్థాయిలో అమలైతే 95 శాతం ఎగుమతులపై సుంకాలు పూర్తిగా తగ్గనున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్లే తెలిపారు.