తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కూర్మన్నపాలెం ప్రజల ప్రత్యేక విజ్ఞప్తి

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో విశాఖపట్నం పరిధిలోని తొంభై తొమ్మిదో వార్డు నుంచి మాజీ కార్పొరేటర్ బొండా జగన్నాధంకు మళ్లీ అవకాశం కల్పించాలని పలు సామాజిక వర్గాల నేతలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు. ఈ మేరకు వడ్లపూడి నుంచి భారీగా తరలివెళ్లిన ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. వార్డులో గతంలో జరిగిన అభివృద్ధిని వివరించి, పార్టీ బలోపేతానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.