హైదరాబాద్లో నీటి సంక్షోభం: జలాశయాల్లో అడుగంటుతున్న నిల్వలతో పెరిగిన ట్యాంకర్ల డిమాండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని జలమండలి అధికారులు తెలిపారు. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ట్యాంకర్ల బుకింగ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని అధికారులు వివరించారు.