హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ కట్టడికి నాలుగు కొత్త బస్ టెర్మినల్స్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో నాలుగు భారీ బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీ నగర్ మరియు ఘట్కేసర్లో ఈ కొత్త టెర్మినళ్లు రానున్నాయని స్పష్టం చేశారు.