చేతకాకపోతే ప్రాజెక్ట్ బాధ్యతలు మాకు అప్పగించండి కేటీఆర్ డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: కన్నెపల్లి

కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీళ్లు కిందికి పోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చేతకాకపోతే ప్రాజెక్టు బాధ్యతలు తమకు అప్పగించాలని, ప్రాజెక్టులకు ఏం జరిగినా తమదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. రైతులకు తామే స్వయంగా నీళ్లు ఇస్తామని ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.