మిద్దిగుంట క్రాస్ వద్ద జంక్షన్ ఏర్పాటు చేయాలని సీపిఐ వినతి

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మిద్దిగుంట క్రాస్ వద్ద జంక్షన్ లేదా అండర్పాస్ ఏర్పాటు చేయాలని సీపిఐ పార్టీ పుత్తూరు మండల కార్యదర్శి డి.మహేష్ నేతృత్వంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో భారీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.