అమెరికా ఎన్నికల ఫలితాలు: యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్లు తీర్పునిచ్చారన్న ఇరాన్

రిపోర్టర్: రమేష్ స్థలం: Washington

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బఘర్ గలిబాఫ్ స్పందించారు. అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఈ ఎన్నికల్ లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ తో సాగుతున్న సంఘర్షణ కూడా ఒక కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక పరిణామాలను ఓటర్లు జీర్ణించుకోలేకపోయారని ఆయన తెలిపారు.