నాదర్గుల్ దాండియా విషాదం: ఘోర ప్రమాద ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన దాండియా వేడుకల్లో లైటింగ్ పోల్ కూలి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై ఆదిభట్ల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈవెంట్ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో సాకేత్, పునీత్, నిశాంతి యాదవ్‌లను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.