సెక్షన్ 22ఏ భూముల దందా: యజమానులను వేధిస్తున్న నిషేధిత జాబితా ఉచ్చు
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో సెక్షన్ ఇరవై రెండు ఏ ప్లాట్లు, ఇండ్ల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని దిశ ప్రత్యేక కథనం వెల్లడించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థలాలను ప్రభుత్వ ల్యాండ్ అంటూ కొర్రీలు పెడుతూ ఆటో లాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల పేరిట అధికారులు సాగిస్తున్న అత్యుత్సాహం వల్ల లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదే అవకాశంగా దళారులు భారీ వసూళ్లకు తెగిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది.