భారీ షాక్: భారత జట్టు నుంచి డ్రాప్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లానని వెల్లడించిన అమిత్ మిశ్రా
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
భారత జట్టు నుంచి తొలగించడంతో తన క్రికెట్ కెరీర్లో తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థంకాక ఒకటిన్నర సంవత్సర పాటు డిప్రెషన్‌తో బాధపడ్డానని ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. సెలక్టర్ల సూచనతో తన ఆటతీరును మార్చుకుని తిరిగి జట్టులోకి వచ్చానని మిశ్రా స్పష్టం చేశారు.