ఆసియా క్రీడలు షఫాలీ వర్మ శతక జోరుతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జపాన్

జపాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భాగంగా బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్టుతో జరుగుతున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ అజేయ శతకంతో చెలరేగింది. ఆమె కేవలం 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు సాధించడంతో, నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.