అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్: కొత్త నిబంధనలపై ఎస్ యూసీఐఎస్ స్పష్టత

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ ఎస్ యూసీఐఎస్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెలవు రోజుల్లో గడువు ముగిస్తే మరో రోజు సమయం దొరుకుతుందని భావించరాదని అధికారులు స్పష్టం చేశారు. అర్హత తేదీలు, సమర్పణ గడువుల మధ్య తేడాలను గమనించాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్ వన్ బి ఉద్యోగులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.