విశ్రాంత ఉద్యోగుల అదనపు పింఛను పునరుద్ధరణపై ఏపీ జేఏసీ హర్షం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 70 మరియు 75 ఏళ్లు దాటిన విశ్రాంత ఉద్యోగులకు అదనపు పింఛనును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు హర్షం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా తాము చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు విశ్రాంత ఉద్యోగుల తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు.