పెట్రోల్ బంకుల్ లో కార్మికుల దోపిడీ: కొణిజర్లలో నిబంధనలకు తూట్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Konijerla

కొణిజర్ల మండలంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిబంధనలను గాలికి వదిలేసి కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని పలువురు కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పీఈఎస్ఓ నిబంధనల ప్రకారం ఒక షిఫ్ట్ కు ఆరు నుంచి ఏడుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో కేవలం ఒకరిద్దరితోనే పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లేబర్ యాక్టు ప్రకారం ఎనిమిది గంటల పనివేళలు, కనీస వేతనాలు అమలు కావడం లేదని, ఓవర్ టైం వేతనాలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని కార్మికులు వాపోయారు.