దులీప్ ట్రోఫీ ఫైనల్: సౌత్ జోన్ కష్టాల్లో, తిలక్ పోరాటం

రిపోర్టర్: సునీల్ స్థలం: India

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్ల ధాటికి సౌత్ జోన్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ అర్ధ శతకం సాధించగా, కెప్టెన్ తిలక్ వర్మ 56 పరుగులతో క్రీజులో నిలిచాడు. భారీ స్కోర్ ఆధిక్యంలో ఉన్న ఈస్ట్ జోన్ విజయం దిశగా సాగుతోంది.