అయోధ్యలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: వారణాసి

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్‌ ప్రపంచం ముందు తిరుగులేని శక్తిగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. వారణాసిలో జరిగిన సేవా సంకల్ప్ అభియాన్‌లో పాల్గొన్న ఆయన, అయోధ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం ఐదు నుంచి పదెకరాల స్థలం కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.