కీళ్ల నొప్పులపై ప్రత్యేక అవగాహన: యువతను సైతం వేధిస్తున్న ఆర్థరైటిస్ సమస్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

ఆర్థరైటిస్ సమస్య కేవలం వృద్ధులకే పరిమితం కాదని, మారుతున్న జీవనశైలి కారణంగా నేడు యువతను సైతం తీవ్రంగా వేధిస్తోందని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ నరేంద్ర వైద్య తెలిపారు. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఊబకాయం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కీళ్ల క్షీణత త్వరగా వస్తుందని, నలభై ఏళ్ల వయసులోనే మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. తొలి దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్సను నివారించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.